ఆయిల్‌పామ్ తోటల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
చీడపీడలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఉద్యాన అధికారిణి సహజ
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : ఆయిల్‌పామ్ తోటల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి కె. సహజ సూచించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల, కిష్టాపూర్ గ్రామాల్లోని ఆయిల్‌పామ్ తోటలను బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్‌పామ్ తోటల్లో వివిధ దశల్లో వచ్చే చీడపీడల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తోటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గురించి రైతులకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మ్యాట్రిక్స్ ఆయిల్‌పామ్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉదయ్‌కుమార్, క్షేత్రాధికారి కవిత పాల్గొన్నారు.
