ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా అగ్రనటులు కమల్‌హాసన్ (Kamal Haasan), రజనీకాంత్(Rajinikanth)కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే.. వీరిద్దరు నటించే సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఆతృతంగా ఎదురుచూస్తారు. వీరిద్దరి సినిమాలు (Movies) విడుదలైతే కోట్ల రూపాయలు కొల్లగొడుతాయి. పాన్ ఇండియా (Pan India) లెవల్లో రజనీ, కమల్‌హాసన్ సినిమాలు రికార్డులు బద్దలు కొడుతాయి. అయితే 1970లో వీరిద్దరు కలిసి 20కి పైగా సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత వీరు కలిసి నటించలేదు. కానీ 46 ఏళ్ల తర్వాత కమల్‌హాసన్, రజనీకాంత్ ఒకే తెరపై కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ మల్టీస్టారర్ సినిమా కోసం కోట్లాది సినీప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఈ మల్టీస్టారర్ (Multistarrer) ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ఇటీవల సైమా అవార్డుల వేదికగా కమల్‌హాసన్ స్వయంగా ఈ బిగ్ అప్‌డేట్ ఇచ్చి అభిమానులను ఉత్సాహపరిచారు.
త్వరలోనే కలిసి నటిస్తాం..
‘రజనీ-కమల్ కాంబినేషన్‌లో సినిమా చూడొచ్చా?’ అన్న ప్రశ్నకు కమల్‌హాసన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ప్రేక్షకులు మా కాంబినేషన్ ఇష్టపడితే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది?. మేమిద్దరం చాలా కాలంగా కలిసి పనిచేయాలని అనుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు కుదరలేదు. త్వరలోనే కలిసి రానున్నాం. అది మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది’ అని వెల్లడించారు.
మా మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు
‘మా మధ్య ఎలాంటి భేదాలు లేవు. ఇవన్నీ బయట వారు సృష్టించుకున్నవే. మేము ఎప్పుడూ పోటీ అనుకోలేదు. ఒకరి సినిమాలు మరొకరం నిర్మించాలనుకున్న సందర్భాలూ ఉన్నాయి’ అని కమల్‌హాసన్ తెలిపారు. ఇక ఈ మల్టీస్టారర్‌కు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం (Directed by Lokesh Kanagaraj) వహించనున్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని, రజనీ-కమల్ ఇద్దరూ గ్యాంగ్‌స్టర్లు (Gangsters)గా అలరిస్తారని కోలీవుడ్(Kollywood)లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.