• ఇంద్రకీలాద్రిపై అంకురార్పణ
  • గణపతికి తొలి పూజలు
  • లాంఛనంగా ప్రారంభించిన ఈఓ శీనా నాయక్…
  • ప్రణాళిక బద్ధంగా.. పకడ్బందీగా….
  • గత అనుభవాల దృష్ట్యా ప్రత్యేక చర్యలు…
  • సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న ఆలయం..
  • పనులు ముమ్మరం చేసిన కార్మికులు…


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : అత్యంత వైభవంగా… ఎంతో అట్టహాసంగా… లక్షల మంది భక్తుల శరణు ఘోష మధ్య నిర్వహించే శ్రీ కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల (Dasara Celebrations) ఏర్పాట్లకు అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, సామాన్య భక్తులందరికీ శీఘ్ర దర్శనం కలిగించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం ప్రారంభించింది.

ఏర్పాట్లలో అతి ముఖ్యమైన కొండ దిగువ కొండపైన భక్తుల సులభంగా చేరుకునేందుకు అవసరమైన క్యూలైన్లకు సంబంధించిన పనులను గురువారం ప్రారంభించారు. విజయవాడ (Vijayawada) లోని కెనాల్ రోడ్ లో ఉన్న వినాయకుడి గుడి వద్ద వైదిక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దుర్గగుడి కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్ క్యూలైన్ పనులను లాంచనంగా ప్రారంభించారు. వినాయకుడి గుడి దగ్గర నుండి ప్రారంభం అవుతున్న ఈ క్యూ లైన్ కనకదుర్గ (KanakaDurga) నగర్ ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ప్రధాన ఆలయం వరకు అత్యంత ప్రతిష్టంగా పకడ్బందీగా నిర్వహించనున్నారు.

సర్వాంగ సుందరంగా అమ్మవారి ఆలయం…

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri) పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబ్ అవుతోంది. ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ఆలయ ప్రాంగణంతో పాటు అమ్మవారి ప్రధానాలయం ఉప ఆలయాలు ఆలయ పరిసరాలను వివిధ రకాల రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన (Infrastructure development)లో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై ఉంది. మరి ముఖ్యంగా ఘాట్ రోడ్డు, దుర్గా ఘాట్ తో పాటు కనకదుర్గ నగర్ లో భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు.

లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అవసరమైన ప్రసాదాన్ని తయారు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారులు వివిధ ప్రాంతాలలో లడ్డు తయారీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు (Special arrangements) చేశారు. అలాగే ఆలయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేసేందుకు అవసరమైన ప్రత్యేక రిసెప్షన్ సెంటర్ ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు భక్తులుకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు ఇలా ప్రతి ఒక్క అంశంలో జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు అందుకు తగ్గట్టుగా ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.

Leave a Reply