సన్‌షైన్‌ హైస్కూల్‌లో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ

  • సమ్మెటివ్‌ అసైన్‌మెంట్‌ పరీక్షల నిర్వహణపై పరిశీలన

ఉట్నూర్‌, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని సన్‌షైన్‌ హైస్కూల్‌ను నూతన విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) నిరంజన్‌ శనివారం తన బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు రాస్తున్న సమ్మెటివ్‌ అసైన్‌మెంట్‌ పరీక్షల నిర్వహణ తీరును అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ నిరంజన్‌ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షల నిర్వహణలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఎంఈఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా పాఠశాలను సందర్శించిన నిరంజన్‌ను పాఠశాల కరస్పాండెంట్‌ షబ్బీర్‌, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.