Nutritional values | ఘనంగా పోషక ఆహారోత్సవ దినోత్సవం…

Nutritional values | ఘనంగా పోషక ఆహారోత్సవ దినోత్సవం…
Nutritional values | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రాథమిక పాఠశాల(Primary school)లో లింగాపూర్ మోడల్ స్కూల్ లో ఈ రోజు విద్యార్థులకు పోషక ఆహారం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు పోషక విలువల(nutritional values)తో కూడిన ఒక వంటకాన్ని తయారుచేసి అందులో వాడిన పదార్థాలు, తయారు చేయు విధానం, దాని ఉపయోగం గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజు తినే ఆహారంలో పౌష్టిక విలువలు సమపాలలో ఉన్నట్లయితే నిరోధక శక్తి మెరుగై పిల్లలు ఆరోగ్యకరమైన(healthy) బాల్యాన్ని గడపగలుగుతారన్నారు.
స్థానికంగా లభించే ఆహారాల్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు వాటిని పిల్లలకు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లూరి శ్రీనివాస్, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బుచ్చన్న, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు శ్యామల, అంగన టీచర్ లక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ధనలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
