ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

ఏలూరు, ఆంధ్రప్రభ: పాయకరావుపేట, ఆంధ్రప్రభ: పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈనెల 2వ తేదీన పాయకరావుపేటలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనకు పరిశీలకుడిగా ఎమ్మెల్యే బడేటి చంటి వెళ్లారు. పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం దేవవరం గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.