వర్షాలను సైతం లెక్కచేయకుండా..

వర్షాలను సైతం లెక్కచేయకుండా..

108 కుండముల గాయత్రీ జ్ఞాన యజ్ఞం: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యజ్ఞం లో భక్తులు :మన్యం పార్వతీపురం జిల్లా భామిని మండలం బెల్లుమడ గ్రామంలో అఖిల విశ్వ గాయత్రీ పరివార్ శాంతికుంజ్, హరిద్వార్, ఉత్తరఖండ్ వారు నిర్వహణ

కొత్తూరు (భామిని ): (ఆంధ్రప్రభ ): మహాద్భుతంగా మహా జ్ఞాన గాయత్రీ యజ్ఞం మంగళవారం ముగిసింది. శ్రీ గాయత్రీ పరివార్ శాంతికుంజ్, హరిద్వార్ వారి ఆధ్వర్యంలో మాతాజీ భగవతీ దేవీ శర్మ జన్మశతాబ్ది, అఖండ జ్యోతి శతాబ్ది సందర్బంగా పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బెల్లుమడ గ్రామంలో ఈ నెల 26 వ తేదీ నుండి 28వ తేదీ వరకూ మూడు రోజులు నిర్వహించిన 108 కుండముల గాయత్రీ యజ్ఞం, సత్సంగం, పూర్ణహుతి వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మంగళవారం వైభవంగా ముగిసాయి.

ఇందులో భాగంగా కలశ శోభయాత్ర, సామూహిక గాయత్రీ మంత్ర జపం, యుగ శిల్పి సంగీతం, దీప యజ్ఞం సత్సంగం పూజా కార్యక్రమాలతో పాటు, గాయత్రీ జపం, సూర్య అర్గ్యం ప్రత్యేక యజ్ఞ పూజలు నిర్వహించారు. మన్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు 108 కలశ కుండములతో ఊరేగింపుగా భామిని మండలం బెల్లుమడ జరిగిన మహా గాయత్రీ యజ్ఞం స్థలానికి చేరుకున్నారు.

మంగళవారం మొంధా తుఫాన్ కి కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా భక్తులు ఈ మహా గాయత్రీ యజ్ఞంలో కూర్చుని గాయత్రీ మంత్ర జపం చేశారు. భక్తి గీతాలు, గాయత్రీ మంత్ర గీతాలు జపిస్తూ భక్తులు ఉత్సాహంగా ఈ మహాద్భుతా మహా గాయత్రీ యజ్ఞంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అఖిల విశ్వగాయత్రీ పరివార్ శాంతికుంజ్, హరిద్వార్ ఉత్తరఖండ్ గాయత్రీ పరివార్ ప్రతినిధులు మాట్లాడుతూ… మానవ విలువలు నానాటికి తగ్గిపోతున్న తరుణంలో జ్ఞానం పెంపొందించుకునుటకు, అలాగే మన పిల్లలను అసాంఘిక శక్తులకు దూరంగా ఉంచుటకు, జ్ఞానోదయం కలిగించుటకు ఈ మహా గాయత్రీ యజ్ఞం నిర్వహించడం అవసరమని వివరించారు.

Leave a Reply