nominations | రాంపల్లి సర్పంచ్ ఏకగ్రీవం…

nominations | రాంపల్లి సర్పంచ్ ఏకగ్రీవం…
nominations | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాంపల్లి సర్పంచ్ గా కనపర్తి సంపత్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామం నుండి కోదాటి దేవేందర్ రావు, కనపర్తి సంపత్ రావు ఇద్దరు నామినేషన్లు దాఖలు(Filing of nominations) చేశారు.
ఇందులో దేవేందర్ రావు ఈ రోజు తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కనపర్తి సంపత్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంపత్ రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో మండలంలో కాంగ్రెస్ సర్పంచ్(Congress sarpanch) అభ్యర్థి ఏకగ్రీవం బోణీ కొట్టారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సంపత్ రావును పలువురు గ్రామస్తులు అభినందించారు.
