పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ
కడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో జరుగుతున్న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ(ZPTC, MPTC) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Abhilash Abhinav) సూచించారు. ఆ రోజు కడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు సకాలంలో సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్(Helpdesk) సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతి రోజు స్వీకరించిన పత్రాలను భద్రపరచి, సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు తగిన పోలీసు బందోబస్తు(Police Dept.) ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. నామినేషన్లపై రోజువారీ నివేదికలను కలెక్టరేట్‌కు పంపాలని సూచించారు. ఆయనతోపాటు నిర్మల్ జెడ్పీ సీఈవో గోవింద్, డిఆర్డివో విజయలక్ష్మి(DRDO Vijayalakshmi), కడెం తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ అరుణ యమ్ ఈ ఓ షేక్ హుస్సేన్ ఎంపీ ఓ కవి రాజ్ కడెం ఎస్సై సాయి కిరణ్ తో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.