Nominations | నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు ఏర్పాటు

Nominations | నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు ఏర్పాటు

Nominations | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మున్సిపల్ పరిధిలోని 12 వార్డులలో నిర్వహించే ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల ఎంపీడీవో, ఐకెపి కార్యాలయాలలో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో ఆరుగురు రిటర్నింగ్ అధికారులను నియమించారు.

ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన 1వ నెంబర్ నామినేషన్ కేంద్రంలో 1,2 వార్డుల అభ్యర్థులు 2 వ నామినేషన్ కేంద్రంలో 3,4 వార్డుల అభ్యర్థులు, 3 వ నామినేషన్ కేంద్రంలో 5,6 వార్డుల అభ్యర్థులు ,4 వ నామినేషన్ కేంద్రంలో 7,8 వార్డుల అభ్యర్థుల నుండి నామినేషన్లు అధికారులు స్వీకరిస్తారు. అలాగే ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 5,6వ నామినేషన్ కేంద్రంలో 9 ,10, 11 ,12 వార్డు సభ్యుల నుండి నామినేషన్ల స్వీకరించనున్నారు.

ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. అలాగే కేంద్రం వద్ద 100 మీటర్ల దూరాన్ని పాటించాలని సూచించారు. నామినేషన్ కేంద్రంలోకి ముగ్గురిని మాత్రమే అనుమతించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

ప్రారంభం అయిన ఎన్నికల సందడి

ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదల చేయడంతో పట్టణంలో ఒక్కసారి ఎన్నికల వేడి ప్రారంభం అయ్యింది. మున్సిపల్ పీఠం డల్కించుకునేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీ లు అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటా పోటీ కనిపిస్తుంది. ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తుంటే బీఆర్ఎస్ కంచు కోట భీంగల్ మున్సిపల్ పీఠం తమదేనని బీఆర్ఎస్ దూసుకెలుతుంది. ఈ సారి అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ లను చావు దెబ్బ కొట్టాలని బీజేపీ సైతం ధీమాలో ఉంది.

డబ్బులు, మద్యం మున్సిపల్ పీఠం ఎవరికీ చేరువ చేస్తాయో చూడాల్సి ఉంది. అధికార పార్టీ రెండేండ్ల వైపల్యాలు, గత పదేండ్లలో చేసిన అభివృద్ధి ని నమ్ముకుని బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికల కంటే ముందే అభివృద్ధి చేస్తాం అండగా ఉండండి అంటూ అధికార పార్టీ ధీమా లో ఉంది. ఈ సారి ప్రజల తీర్పు భిన్నంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Leave a Reply