Nominations | రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ

Nominations | రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ
- 4 నామినేషన్ల స్వీకరణ కౌంటర్ల ఏర్పాటు
- మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్
Nominations | మోత్కూర్, ఆంధ్రప్రభ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు గాను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ స్థానాలకు రేపు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్ విలేకరులకు తెలిపారు. పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో 2,మున్సిపాలిటీ కార్యాలయంలో 2 కౌంటర్ల చొప్పున మొత్తం 4 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
ఒక్కో కేంద్రాల్లో 3వార్డుల చొప్పున 4 కేంద్రాల్లో 12 వార్డుల నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.ఈనెల 30 సాయంత్రం 5 గంటల వరకు 3 రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 1న అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 2న అభ్యంతరాల పరిష్కారం, ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు సంబంధించి 26 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుందని వివరించారు.
