Nomination| మరణం.. విజయం..
Nomination| చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో స్థానిక ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. మండలంలోని ఏపూర్ గ్రామానికి చెందిన మందుల లక్ష్మమ్మ వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసింది. వారం రోజుల క్రితం అనివార్య కారణాలవల్ల ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించింది. మరణించిన వ్యక్తి లక్ష్మమ్మ (Lakshmamma) పేరును అధికారులు తొలగించకపోవడంతో నామినేషన్ పత్రాలలో ఆమె పేరు అలాగే ఉంది. లక్ష్మమ్మకు 112 ఓట్లు పోలయ్యాయి. ఆమె ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి 78 ఓట్లు రాగా మరణించిన లక్ష్మమ్మ వార్డు సభ్యులుగా విజయం సాధించింది. ఈ సంఘటనతో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది.

