Nizampet | ఎన్నికలు సజావుగా జరగాలి..

Nizampet | ఎన్నికలు సజావుగా జరగాలి..
నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Nizampet | నిజాంపేట, ఆంధ్రప్రభ : స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల సజావుగా సాగాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Collector Rahul Raj) అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 492 పంచాయతీల్లో ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందన్నారు. నిజాంపేట (Nizampet) మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆదివారం రెండో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఈ రెండో విడత ప్రక్రియలో 8 మండలాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో 1049 గ్రామపంచాయతీలు 1290 వార్డుల అభ్యర్థులు నామినేషన్ వేస్తారని తెలిపారు.
ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు తప్పకుండా సర్టిఫికెట్ జత చేయాలని, అలాగే బ్యాంక్ ఖాతా తప్పనిసరి అని, అకౌంట్ తీసేవారికి ఒకే రోజులో అకౌంట్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పహారాలో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల అధికారులకు కూడా ప్రజలు సహకరించాలన్నారు. అలాగే ఎవరు ప్రలోభాలకు గురికాకుండా తమ తమ ఓటు హక్కులను వినియోగించుకోవాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, ఆర్ఐ ప్రీతి, ఎంఈఓయాదగిరి, ఇంచార్జ్ ఎంపిఓ వెంకట నరసింహారెడ్డి, నామినేషన్ ప్రక్రియ అధికారులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
