Nizampet | మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ సప్లై పై స్పెషల్ డ్రైవ్….

Nizampet | మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ సప్లై పై స్పెషల్ డ్రైవ్….

Nizampet | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో వచ్చే ఎండ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి లేకుండా ఉండడానికి జిల్లా కలెక్టర్, జిల్లా మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదేశాల మేరకు డ్రింకింగ్ వాటర్ సప్లై పైన స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ ను గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి గ్రామస్తులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ బల్క సప్లై, అన్ని త్రి ఫేస్ మోటర్లు, సింగల్ ఫేస్ మోటర్లు అన్నిటిని కూడా వర్కింగ్ కండిషన్లో ఉండడానికి వారికి సూచనలు చేయడం జరిగింది. ఆలాగే ఎండాకాలంలో నీటి వృధాను అరికట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఇట్టి కార్యక్రమము జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో ఈ నెల 2 నుండి 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, వార్డు సభ్యులు, మిషన్ భగీరథ హెల్పర్లు పాల్గొన్నారు.

Leave a Reply