Nizampet | చల్మెడ జాతరలో పోటెత్తిన భక్తులు..

Nizampet | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవ భాగంగా ఆదివారం రెండవ రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తర దార దర్శనంలో కొలువుదీరిన స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ అన్నారు.

Nizampet

ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ ఏవో రవికుమార్ తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భద్రతతో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.

భక్తులు ఓపికతో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్,రాజిరెడ్డి, ఎల్లా గౌడ్, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం,ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, రాజు,కిష్టారెడ్డి, వెంకట్ రెడ్డి, భాజా తిరుమల్, మహేష్,మావు రంరాజు,శేఖర్, నారాయణ,హరి, నవీన్ గౌడ్, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply