Nizambad | క్రీడలతో మానసిక ఉల్లాసం..

Nizambad | క్రీడలతో మానసిక ఉల్లాసం..

Nizambad, బిక్కనూర్, ఆంధ్రప్రభ : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని బిక్కనూర్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది లింగాల రాజబాబు గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో మా దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు స్నేహపూర్వకంగా క్రీడా పోటీలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా ఆరోగ్యం ఐక్యత స్నేహభావం పెరుగుతుందని చెప్పారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నారు. క్రీడలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఓటమి చెందిన వారు నిరుత్సాహ పడకుండా రేపటి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులందరూ ఎంతో ఆనందోత్సవాల మధ్య క్రికెట్ పోటీలలో పాల్గొనడం ఎంతో అభినందనీయమని ఆయన చెప్పారు.

Leave a Reply