Nizamabad | సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా శ్రీనివాస్

Nizamabad | సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా శ్రీనివాస్
Nizamabad | మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కోడిచెర్ల సర్పంచ్ వేల్పూర్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ రోజు నిర్వహించిన సర్పంచుల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా బుట్టడి ప్రమోద్(Buttadi Pramod), ప్రధాన కార్యదర్శిగా రవి నాయక్, కోశాధికారిగా కోడిముంజ మాధురి రాజులను ఎన్నుకున్నారు.
మండల సమగ్ర అభివృద్ధి(development)కి కృషి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నూత్ పల్లి శ్రీనివాస్, సతీష్, బాబా, శ్రీనివాస్, నర్సవ్వ మల్లేష్, ముత్యం, కవిత దన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుమో రాజేశ్వర్, రాజారెడ్డి, మోహన్, దేవరాజ్, మౌలానా, అశోక్, సాయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
