Nizamabad | రెండు సంవ‌త్స‌రాల‌లో అభివృద్ధి…

Nizamabad | రెండు సంవ‌త్స‌రాల‌లో అభివృద్ధి…

Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభివృద్ధికి ఓటర్లు పట్టం కట్టారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ(Shabbir Ali) అన్నారు. ఈ రోజు కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ… పది సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణలో రెండు సంవత్సరాలలో జరిగిందన్నారు.

బీఆర్ఎస్, బీజేపీలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)ను భారీ మెజార్టీతో గెలిపించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply