కాల‌కృత్యాల‌కు వెళ్లి….

కాల‌కృత్యాల‌కు వెళ్లి….

అంచెరువులో మృతదేహం లభ్యం…

ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామ శివారులో గల చెరువులో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు డప్పు మహేష్ (40)గా గుర్తించారు. మృతుడు ఆదివారం వేకువజామున కాలకృత్యాల కొరకు ఇంటినుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మృతుని భార్య డప్పు నాగమణి తన భర్త కనబడడం లేదంటూ ఆదివారం ఎడపల్లి పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు.

Leave a Reply