అపర కుబేరుడు, భారతదేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సాయి బాబాని దర్శించుకున్నారు. దర్శనానంతరం సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష్ గాడిల్కర్ నీతా అంబానీ సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
