Nirmala Sitharaman | కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి..

Nirmala Sitharaman | కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
Nirmala Sitharaman | ఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు రాబోయే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి, అభివృద్ధికి సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన పలు విజ్ఞాపన పత్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రానున్న మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం అవసరమని, దీని కోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు కోరారు.

అలాగే కరవు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి వరద జలాలను తరలించే పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు (Polavaram-Nallamala Sagar Link Project) ఆర్థిక చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని సీఎం కోరారు. పూర్వోదయ పథకం కింద గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
