నిర్మల్‌లో జీయర్‌ స్వామివారికి పాదపూజ

వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు

నిర్మల్, ఆంధ్రప్రభ : నిర్మల్‌ పట్టణంలోని నటరాజనగర్‌లో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు ఆమడ శ్రీధర్‌ నివాసంలో శనివారం పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ షఠగోప ముని రామానుజ జీయర్‌ స్వామివారికి పాదపూజ నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు దివ్య ఆగమన తీర్థ గోష్ఠి, అనుగ్రహ భాషణం, ఆశీర్వచనం అందించారు.

సమస్త భక్తజనులు, ఆస్తిక మహాశయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జీయర్‌ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పురోహితులు రామకృష్ణ కన్నన్‌, జిల్లా సివిల్‌ సప్లై మేనేజర్‌ సుధాకర్‌, బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యన్నగారి భూమయ్య, కౌన్సిలర్‌ సాధం స్వప్న అరవింద్‌, నర్సారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.