Nightmare in Goa  : Palms క్లబ్​ విస్ఫోటనం

Nightmare in Goa  : Palms క్లబ్​ విస్ఫోటనం

  • గోవాలో  25 మంది దుర్మరణం
  • అత్యధికులు కిచెన్​ కార్మికులు
  • ఇక్కడ అన్నీ అక్రమ క్లబ్బులే
  • ఆఫీసర్లపై చర్యలు తప్పవు : సీఎం సావంత్​ ​

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్)​

అది గోవా. ఆ పేరు వినపడితే.. యావత్తు విశ్వవ్యాప్త పర్యాటకులు పరవశించిపోతారు. ఒక్క సారి గోవా వెళ్లి ఆనందోత్సాహంతో చిందులు వేయాలని కలగంటారు. కానీ ఈ కల ప్రమోదం కాదు.. పెను ప్రమాదమని ( Night mare)  ఉత్తర గోవాలో ఎలాంటి అనుమతి లేని  బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌ (Birch by Romio Night Club)  నిరూపించింది.

Nightmare in Goa : ఆదివారం అర్ధరాత్రి .. దాదాపు  100 మంది డ్యాన్స్ ఫ్లోర్‌లో Floor Dance)  స్టెప్పుల్లో మునిగి తేలుపోతుండగా.. అకస్మాత్తుగా..పేలుడు (Explosion)   సంభవించింది. విస్పోటనం కోరలు చాచింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికి 25 మంది (25 Dead Alive) ప్రాణాలు వదిలారు. వీరిలో అత్యధికులు కిచెన్​ లో  పని చేస్తున్న  కార్మికులు. ఇందులో నలుగురు మహిళలు బూడిదయ్యారు. మరో నలుగురు పర్యాటకులు ఉన్నారు. అసలు ఆదివారం రాత్రి ఏం జరిగింది.

Nightmare in Goa భారత దేశంలోనే ఓ నైట్​ క్లబ్​ లో జరిగిన దుర్ఘటనగా చరిత్ర సృష్టించింది. పీటీఐ  ప్రాథమిక సమాచారం మేరకు,   ఆదివారం (డిసెంబర్ 7, 2025) అర్ధరాత్రి తర్వాత కిచెన్​ లోని  సిలిండర్ పేలి (Cylender Exploied)    నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగాయని రాష్ట్ర పోలీసులు చెప్పగా,  పర్యాటకులు నృత్యం చేస్తున్న క్లబ్ మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయని  ప్రత్యక్ష సాక్షులు  చెబుతున్నారు. గోవా  రాజధాని పనాజీ (Goa Capital Panaji)  నుండి 25 కి.మీ దూరంలోని అర్పోరా గ్రామంలోని  బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో ఈ ప్రమాదం జరిగింది.

ఈ అగ్నిప్రమాదంలో అక్కడిక్కడే  23 మంది మరణించారు.  మృతుల్లో ఎక్కువ మంది క్లబ్‌లోని వంటగది కార్మికులు కాగ, వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని గోవా సీఎం  ప్రమోద్ సావంత్ (Cm Pramod savanth) తెలిపారు. మృతుల్లో నలుగురు పర్యాటకులు  ఉన్నారని సీఎం వివరించారు.

  Nightmare in Goa : ప్రత్యక్ష సాక్షి హైదరాబాదీ

ఈ దుర్ఘటనకు ప్రత్యక్ష సాక్షి హైదరాబాదీ షేక్​ ఫాతిమా (Sk. Pathitha)  మాట్లాడుతూ,  మంటలు చెలరేగగానే    అకస్మాత్తుగా గందరగోళం నెలకొంది. మేము క్లబ్ నుంచి  బయటకు పరుగెత్తాం. మొత్తం క్లబ్​ కాలిపోయింది,  ఫాతిమా షేక్ ఆదివారం తెల్లవారుజామున అర్పోరాలో PTIకి తెలిపారు.

వారాంతం కావడంతో నైట్‌క్లబ్ కిక్కిరిసిపోయి ఉందని, కనీసం 100 మంది డ్యాన్స్ ఫ్లోర్‌లో ఉన్నారు.  మంటలు చెలరేగిన తర్వాత, కొంతమంది పర్యాటకులు కిందికి పరిగెత్తారు.  ఈ గొడవలో, గ్రౌండ్ ఫ్లోర్‌లోని వంటగదిలోకి వెళ్లారు.   పర్యాటకులు, ఇతర సిబ్బంది  అక్కడ చిక్కుకున్నారు. చాలామంది క్లబ్ నుండి బయటకు పరుగులు తీశారు” అని ఆమె జోడించారు.

Nightmare in Goa : అది తాటాకుల క్లబ్​

కొద్దిసేపటికే, క్లబ్ మొత్తం మంటల్లో కాలిపోయింది.  “తాటి ఆకుల   తాత్కాలిక (Palms Construction)  నిర్మాణం.  అది   మంటలకు ఆహుతైంది” అని ఆమె చెప్పారు. ఈ నైట్‌క్లబ్ అర్పోరా (Arpora River) నది వెనుక భాగంలో ఉంది   రాకపోకలకు  ఇరుకైన ప్రవేశం, నిష్క్రమణ ( Narrow Line) మార్గాలే ఉన్నాయి,   ఇరుకు  లేన్‌ లతో అగ్నిమాపక దళాలకు క్లబ్‌లోకి ప్రవేశం లేదు, 

ట్యాంకర్లను ప్రమాద స్థలికి   దాదాపు 400 మీటర్ల దూరంలో నిలిపివేయక తప్పలేదు.  అగ్నిమాపక   అత్యవసర సేవలకు చెందిన ఒక సీనియర్ అధికారి PTI తో  మాట్లాడుతూ, ఇరుకైన మార్గం కారణంగా  ప్రమాద స్థలికి చేరుకోవడం కష్టమైందని, దీనివల్ల మంటలను నియంత్రించడం ఒక సవాలుతో  మారిందని అన్నారు. బాధితులు గ్రౌండ్ ఫ్లోర్‌లో చిక్కుకున్నందున ఎక్కువ  మంది ఊపిరాడక మృతి చెందినట్టు  ఆయన అన్నారు.

Nightmare in Goa : విచారణకు ఆదేశించాం : సీఎం సావంత్​

ప్రమాద స్థలానికి చేరుకున్న గోవా సీఎం  ప్రమోద్ సావంత్ విలేకరులతో మాట్లాడుతూ, నైట్‌క్లబ్ అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించలేదని అన్నారు. ఈ  విచారణకు ఆదేశిస్తానని, క్లబ్ నిర్వహణ   సంస్థ పనిచేయడానికి అనుమతించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని సీఎం  అన్నారు.

Nightmare in Goa : అన్నీ అక్రమ క్లబ్​ లే

అర్పోరా-నా గోవా పంచాయతీ సర్పంచ్ ( Arpora Surpach)  రోషన్ రెడ్కర్ మాట్లాడుతూ, క్లబ్‌ను సౌరవ్ లూత్రా నడుపుతున్నాడని, అతనికి తన భాగస్వామితో వివాదం (Dispute)  ఉందని అన్నారు. వారి మధ్య వివాదం జరిగి,   ఒకరిపై ఒకరు పంచాయతీకి ఫిర్యాదు చేసుకున్నారు. మేము ఆ స్థలాన్ని తనిఖీ చేసి, క్లబ్ నిర్మించడానికి ( no permission)  అనుమతి లేదని తెలిసింది”అని ఆయన అన్నారు. పంచాయతీ కూల్చివేత నోటీసు జారీ చేసింది, దానిని పంచాయతీ డైరెక్టరేట్ అధికారులు నిలిపివేసినట్లు రెడ్కర్ చెప్పారు.

ఈ వివాదమూ కారణమేనా? ప్రాంగణపు అసలు యజమాని ఆ స్థలాన్ని లూత్రాకు సబ్‌లెట్‌గా ( Sub let ) ఇచ్చారని ఆయన అన్నారు. ఈ అగ్నిప్రమాదం దురదృష్టకరం. నిబంధనలను ఉల్లంఘించినట్లు కనిపించే సంస్థలకు  నోటీసులు జారీ చేస్తున్నాం, అని ఆయన అన్నారు. ఈ ఘటన తర్వాత ఆ స్థలాన్ని సందర్శించిన కలాంగుట్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో, (Mla Micheil)  అటువంటి ఈ ఘటన పునరావృతం కాకుండా చూసుకోవడానికి స్థానిక పంచాయతీలు అన్ని నైట్‌క్లబ్‌లలో అగ్నిమాపక భద్రతా ఆడిట్ నిర్వహిస్తాయని చెప్పారు.

Nightmare in Goa

కలాంగుట్ పంచాయతీ సోమవారం అన్ని నైట్‌క్లబ్‌లకు (Issued Notices)  నోటీసులు జారీ చేస్తుందని, అగ్నిమాపక భద్రతా అనుమతులు అందించాలని కోరుతూ ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైన అనుమతులు లేని క్లబ్‌ల లైసెన్స్‌ (Licenses will Cancel) లను రద్దు చేస్తామని ఆయన తెలిపారు. 

Patients Kidnop : కమీషన్ల దాదా MBBS

Leave a Reply