Nifty 290.55 | సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టం

Nifty 290.55 | సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టం

Nifty 290.55 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12.25 గంటల సమయానికి 1,018.62 పాయింట్లు కోల్పోయి 82,276.04 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 290.55 పాయింట్లు క్షీణించి 25,422.45 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడు పాయింట్లు పతనమై 90.96గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎటర్నల్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

హిందుస్థాన్‌ యూనిలీవర్‌, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, సరికొత్త ఫీచర్లతో దూసుకొస్తున్న ఏఐ టూల్స్‌ భయాలతో దేశీయంగా ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్‌ వెయ్యికి పైగా పాయింట్ల పతనమైంది.సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను ఆధునికీకరించే ఖర్చు క్లాడ్ ఏఐ టూల్స్‌తో తగ్గనుందని ఆంథ్రోపిక్ ప్రకటించింది. ఇది భారత ఐటీ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

Nifty 290.55 |

Leave a Reply