మాజీ ఎమ్మెల్యే ని కలిసిన అలంపూర్ నూతన ఎస్ఐలు..

ఇటిక్యాల, ఆంధ్ర‌ప్ర‌భ : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లకు నూతనంగా ఎస్ఐలు నియమితులయ్యారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ముగ్గురు ఎస్ఐలు ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

నియోజకవర్గంలోని అలంపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రామకృష్ణ, మనపాడు ఎస్ఐగా స్వాతి, కోదండపురం ఎస్ఐగా భరత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాజీ ఎమ్మెల్యేని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు సంపత్ కుమార్ అభినందనలు తెలియజేస్తూ, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Leave a Reply