Love Dispute | భవనం పైనుంచి దూకి ప్రియుడు మృతి
Love Dispute | పాయకాపురం, ఆంధ్రప్రభ : నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రేమ వ్యవహారం విషాదానికి దారితీసింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న మహాలక్ష్మి, చిన్నారావు మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. మహాలక్ష్మిపై అనుమానంతో చిన్నారావు ఆమె మెడపై కొడవలితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహాలక్ష్మి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

దాడి అనంతరం చిన్నారావు భవనం డాబాపైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, ఇతర వివరాలపై ఆరా తీస్తున్నారు.
