New Night Mare :  హ్యాపీ..హెల్​   AndhraPrabha Detail News

New Night Mare :  హ్యాపీ..హెల్​   AndhraPrabha Detail News

ఆల్పైన్  స్కీ రిసార్ట్‌ లో గావు కేక

40 మంది ఆహుతి

100 మంది ఆసుపత్రిపాలు

( ఆంధ్రప్రభ, వెబ్​ డెస్క్)​

పర్యాటక ప్రపంచ పటంలోనే.. అదొక స్వర్గధామం. స్విట్జర్లాండ్‌  క్రాన్స్-మోంటానా నగరంలోని  ఆల్పైన్  స్కీ రిసార్ట్‌ .. నూతన సంవత్సర వేడుకల్లో సందడి తారా స్థాయికి చేరింది. ఓ వైపు సంగీత విభావరి తనువును కదిపేస్తుంటే.. స్మాల్​ పెగ్​ మందు గొంతులోకి దిగగానే.. రుచికర మంచింగ్​ తో.. జనం ఊగుతున్నారు.

New Night Mare

అప్పటికే హ్మాపీ న్యూఇయర్​ గ్రీటింగ్​ దద్దరిల్లాయి. పరస్పర ఆలింగనాలతో..  అలయ్​ బలయ్ లతో మైమరచి పోతున్న వేళ.. ఆనంద హేల.. హాహాకారాలతో ( New Night Mare) మిన్నంటింది. భారీ విస్పోటనంలో 40 మంది (40 dead)  ఆహుతయ్యారు. 100  పైగా (100 Injured)  తీవ్రగాయాలతో అల్లాడిపోయారు. ఈ ధుర్ఘటన ప్రపంచాన్ని కలచివేసింది.

New Night Mare : ఇదొక పీడకల

భారత కాలమానం ప్రకారం,  గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో  పేలుడు కకావికలం చేసింది ,   స్విట్జర్లాండ్‌  కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 1:30 గంటలకు  కాన్స్టెలేషన్ బార్‌లో (ConStellation Bar)  పేలుడు (Explossion)   సంభవించింది.

New Night Mare

ఈ    సమయంలో  బార్ లోపల 100 మందికి పైగా ఉన్నారు. ఈ దుర్ఘటన సమాచారంతో  పోలీసులు,    అత్యవసర బృందాలు  ప్రమాద  స్థలానికి హుటాహుటిన  చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.   క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

New Night Mare :  సహాయక చర్యల్లో…

(10 Helicaptors)  10 హెలికాప్టర్లు, 40 ఆంబులెన్సులు,   150 మంది (150 Medical Team) వైద్య సిబ్బంది చేరుకున్నారు.  పేలుడుకు   కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఆల్పైన్  స్కీ రిసార్ట్‌   మూసివేశారు.   నో-ఫ్లై జోన్ అమలు చేస్తున్నారు. ఈ విషాదాన్ని అగ్నిప్రమాదంగా అధికారులు  పరిగణిస్తున్నారు,

New Night Mare

ఉగ్రవాద దాడి కాదు అని ఓ అధికారి ప్రకటించారు.  పేలుడు బాణసంచా కారణంగా పేలుడు  సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పేలుడు ఘటనపై ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరిస్తున్నాయి.  బార్‌లోని  వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.  

New Night Mare :  ఇదొక స్వర్గధామం

సెలవుల కాలంలో క్రాన్స్- మోంటానాకు  పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుతారు. క్రాన్స్-మోంటానా అనేది స్విస్  ఆల్ప్స్‌లోని  ఒక విలాసవంతమైన స్కై  రిసార్ట్. ఇది స్విస్ రాజధాని బెర్న్   రెండు గంటల   దూరంలో ఉంది  

New Night Mare

 ప్రతి సంవత్సరం, ముఖ్యంగా శీతాకాలం   నూతన సంవత్సర వేడుకలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. జనవరి చివరిలో, ఈ రిసార్ట్‌లో స్పీడ్  స్కీయింగ్ పోటీ, FIS  ప్రపంచ కప్ జరగనుంది.   స్విట్జర్లాండ్‌లోని అత్యంత ప్రత్యేక  ప్రదేశాలలో ఒకటైన క్రాన్స్-మోంటానా మాటర్‌ హార్న్ నుండి మోంట్ బ్లాంక్ వరకు విస్తరించి ఉన్న అద్భుత  దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది.   

New Night Mare  : ఈ రిసార్ట్ మేటి విడిది

కాన్‌స్టెలేషన్ లాంజ్ బార్, లగ్జరీ స్కీ రిసార్ట్ కీలకం.  స్కీయర్‌లను పర్వతాలలోకి తీసుకెళ్లే లిఫ్ట్ దిగువ స్టేషన్ నుండి కొద్ది దూరంలో ఉంది.  స్కీ రిసార్ట్   అధికారిక వెబ్‌సైట్‌లోని బార్  వివరణ ప్రకారం, ఈ సంస్థ 300 మంది సామర్థ్యం కలిగి ఉంది, 40 మందికి టెర్రస్ స్థలం ఉంది. పగటిపూట కాఫీ పేస్ట్రీలను అందించే కేఫ్, కాన్‌ స్టెలేషన్‌లో రెండు బార్‌లు  ప్రత్యేకమైన షిషా స్మోకింగ్ ఏరియా ఉందని వెబ్‌సైట్ తెలిపింది.

New Night Mare

కాన్‌స్టెలేషన్ బార్ లోపల ఫోటోలు చీకటిగా, గుహ లాంటి స్థలాన్ని, దాని మధ్యలో ప్రకాశవంతంగా వెలిగే పెద్ద బార్‌ను చూపిస్తున్నాయి. సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం మాటర్‌ హార్న్ నుండి యూరప్‌లోని ఎత్తైన శిఖరాలలో ఒకటైన మోంట్ బ్లాంక్ వరకు విస్తరించి ఉన్న అద్భుతమైన ఆల్పైన్ దృశ్యాలను కలిగి ఉంది.

ALSO READ : Drone attack | డ్రోన్‌ దాడి.. 24 మంది మృతి

Leave a Reply