వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యంత విజయవంతమైన పరుగుల చేధనల జాబితాలో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఈరోజు ఆస్ట్రేలియాపై జరిగిన సెమీఫైనల్ విజయంతో, భారత మహిళల జట్టు ఇప్పటివరకు పురుషుల జట్లు నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టింది.
డి.వై. పాటిల్ మైదానంలో నేడు జరిగిన వన్డే సెమీఫైనల్‌లో 339 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన భారత్ మహిళల జట్టు.. ఆస్ట్రేలియాపై 341/5 స్కోరుతో గెలిచింది. ఈ అద్భుత విజయం ప్రపంచకప్ చరిత్రలోనే నాకౌట్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన రన్ చేజ్‌గా నిలిచింది.
ఇంతవరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో 2015లో న్యూజిలాండ్ పురుషుల జట్టు దక్షిణాఫ్రికాపై 299/6 పరుగుల విజయంతో ఉంది. కానీ, ఆ రికార్డును భారత మహిళల జట్టు బద్దలు కొట్టి.. అత్యధిక విజయవంతమైన రన్ నమోదు చేసింది.
న్యూజిలాండ్ పరుషుల జట్టు తరువాత మూడో స్థానంలో 1996లో చెన్నై జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా పురుషుల జట్టు, న్యూజిలాండ్ సెట్ చేసిన 287 పరుగుల లక్ష్యాన్ని చేధించి 289/4 స్కోరుతో గెలిచింది.
ఈ విజయంతో భారత మహిళలు కేవలం ఫైనల్ టికెట్ మాత్రమే కాకుండా.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో పురుషుల రికార్డును అధిగమించి.. కొత్త రికార్డ్ ను సెట్ చేసింది.

