మదనపల్లి రియల్ చాన్స్

తెరమీదకు రాజంపేట
కార్యాలయాల భవనాల కోసం అన్వేషణ
అన్నమయ్య బ్యూరో (ఆంధ్రప్రభ) : ఏపీలో శరవేగంగా సాగుతున్న కొత్త జిల్లాల ప్రక్రియలో ఇన్ సైడ్ డవలప్ మెంట్ .. చాప కింద నీరులా సాగుతూ ఉన్నట్టు- పరిస్థితులు వివరిస్తున్నాయి. వీలైనంత త్వరగా కొత్త జిల్లాల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు సంబంధిత ఆదేశాలు స్పష్టంగా వచ్చినట్టు- అధికారిక వర్గాల సమాచారం. దీనిని బట్టి చూస్తే అన్నమయ్య జిల్లాలో మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటు- చేయడం దాదాపు ఖరారు అయినట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇంకా జాబితా ప్రకటించకపోవడంతో కొందరు మదనపల్లి జిల్లా కేంద్రం అవుతుందా కాదా అనే తర్జనభర్జనలో ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా అధికారులు మాత్రం తమకందిన సంకేతాలతో ఎవరికి వారుగా మదనపల్లిలో జిల్లా కార్యాలయాలకు తగిన భవనాలను అన్వేషిస్తున్నట్టు- సమాచారం. అదేవిధంగా జిల్లా పరిపాలన కార్యాలయం కూడా ఏర్పాటు- చేయవలసి ఉన్నందున తాత్కాలికంగా అధికారులు పనిచేసే విధంగా అనుకూలమైన భవనాలను వెతుకుతున్నట్టు- తెలుస్తోంది. బ్రిటిష్ కాలం నుంచి మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఉండడంతో రెవెన్యూ శాఖ పరిపాలన సౌలభ్యం కూడా కొంత సులువుగా ఉంటు-ందని ఆ శాఖలోని కొందరు అధికారులు అంటు-న్నారు. ఇప్పటికే మంత్రివర్గంలోని కొత్త జిల్లాల సబ్ కమిటీ- తయారు చేసిన నివేదిక ప్రకారం అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం పీలేరును రెవెన్యూ డివిజన్ గా మార్చడంతో పాటు- మరో రెవెన్యూ డివిజన్ గా ఉన్న మదనపల్లె ను జిల్లా కేంద్రంగా చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టేనని పలువురు అంటు-న్నారు. ఇదే జరిగితే ఒక్కసారిగా జిల్లా పరిపాలన సౌలభ్యం కోసం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పనిచేయడానికి తగినన్ని భవనాలు అవసరమవుతాయి. అందు కోసం ఇప్పటినుంచి మదనపల్లిలో కసరత్తును ప్రారంభించినట్లు- తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలా ఉండగా మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిపోయిందని. ఇక్కడ విద్య వైద్యం రైలు మార్గం అన్ని రకాల వసతులు ఉండటంతో మదనపల్లెలో సొంతిల్లు ఉంటే మంచిదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రచారం చేస్తున్నారు. భూముల ధరలను పెంచడమే కాకుండా ముందుగా వేసిన వెంచర్లను కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. మదనపల్లె కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు- అవుతుండడంతో మదనపల్లె ప్రాధాన్యతను తెలుపుతూ రియల్టర్లు పలు రకాల బ్రోచర్లను వేయించేందుకు సన్నద్ధులవుతున్నట్టు- సమాచారం.
తెర మీదకు రాజంపేట
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తూ పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు నియోజక వర్గాలను కలిపి జిల్లాగా చేయడమే కాకుండా రెవెన్యూ డివిజన్ కేంద్రం మదనపల్లి ని జిల్లాగా చేసే ఏర్పాటు- దాదాపుగా ఖరారు అయిందని అధికార వర్గాల సమాచారం. ఇక అన్నమయ్యలో కేవలం రాయచోటి రాజంపేట, రైల్వే కోడూరు, నియోజకవర్గాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాస్తవానికి ఆ మూడు నియోజకవర్గాలను కలిపి అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు- చేసినా తగినన్ని మండలాలు సమకూరే అవకాశం లేదు. 17 మండలాలు ఈ మూడు నియోజకవర్గాల నుంచి ఉండడంతో అన్నమయ్య జిల్లా పరిధిలోకి బద్వేలును కూడా కలుపుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటు-న్నారు. ఇదే జరిగితే ఈ నాలుగు నియోజకవర్గాలకు అనుకూలంగా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు- చేయవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది అని మరికొందరు అంటు-న్నారు. ఈ నేపథ్యంలో బద్వేలు, రాయచోటి, రైల్వే కోడూరు నియోజకవర్గాలకు ఇంచుమించు సమాంతర దూరంగా రాజంపేట ఉంటు-ందని పలువురు అంటు-న్నారు. దీనిని బట్టి చూస్తే అన్నమయ్య జిల్లా కేంద్రం రాజంపేటకు మార్చే అవకాశాలు లేకపోలేదని వివరిస్తున్నారు.
-అధికారులకు పరోక్ష సంకేతాలు-
కొత్త జిల్లాల ప్రకటన వీలైనంత త్వరగా వెలువడే అవకాశం ఉండడంతో సబ్ కమిటీ- ప్రతిపాదించిన జిల్లా కేంద్రాలలో పరిపాలన సౌలభ్యాలు ఏర్పాటు- చేసుకోవడానికి అధికారులకు పరోక్షంగా సంకేతాలు అందినట్టు- తెలుస్తోంది. అదేవిధంగా మిగిలిన జిల్లాల్లో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కేంద్రాలను మార్చే అంశంపై కూడా అధికారులకు సంకేతాలు ఉన్నట్టు- తెలుస్తోంది దీంతో రాజంపేటలో జిల్లా కార్యాలయానికి అనువైన భవనాలను సిద్ధంగా ఉంచుకోవాలని పలు ప్రభుత్వ శాఖల డివిజన్ అధికారులకు ఆయా సేకల రాష్ట్ర కార్యాలయ అధికారుల ద్వారా సంకేతాలు అందినట్టు- సమాచారం. దీంతో వారు వారి శాఖల జిల్లా కార్యాలయాల ఏర్పాటు- కోసం భవనాల వెతుకులాటలో పడినట్లు- తెలుస్తోంది. తాజాగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఒక కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ముఖ్య అధికారులను ఆహ్వానించి కొత్త జిల్లాల ఏర్పాటు- పరిపాలన సౌలభ్యం పై సమీక్షించినట్టు- సమాచారం.
