జనగామలో విజ్ మనీ నూతన శాఖ ప్రారంభం

జనగామలో విజ్ మనీ నూతన శాఖ ప్రారంభం
- విద్యార్థులకు బుక్స్ బ్యాగులు పంపిణీ
- జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి
జనగామ, ఆంధ్రప్రభ : జనగామ పట్టణంలో విజ్ మనీ సంస్థ నూతన శాఖను గురువారం జోమి ల్యూక్ జేవియర్ – చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, జోనల్ హెడ్ శ్రీ నివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో మొత్తం 336 బ్రాంచ్ లు నడుస్తుండగా తెలంగాణలో 35 బ్రాంచులతో పాటు జనగామలో నూతన శాఖ ప్రారంభించామని ఆయన తెలిపారు.

జనగామ, పరిసర ప్రాంత ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ శాఖ ప్రారంభం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కస్టమర్ సంతృప్తి, పారదర్శకత మరియు వేగవంతమైన సేవలే విజ్ మనీ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఈ శాఖ ద్వారా విదేశీ కరెన్సీ మార్పిడి, విదేశాలకు డబ్బు పంపే సౌకర్యం, ఫారెక్స్ ట్రావెల్ కార్డ్ సేవలు, విమాన టికెట్ బుకింగ్,
హాలిడే ప్యాకేజీలు, తక్కువ వడ్డీ రేటుతో గోల్డ్ లోన్లు వంటి సేవలు అందిస్తుందని తెలిపారు.
అదేవిధంగా, సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ ఆర్) కార్యక్రమాలలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోందని ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు. అదనంగా విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు. సమాజ అభివృద్ధికి విజ్ మనీ కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ శ్రీ రాజేంద్రప్రసాద్ ఆంధ్ర తెలంగాణ ఐఏటిఏ హెడ్ శ్రీ రవి , బ్రాంచ్ మేనేజర్ పందిర్ల సురేష్, సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు.
