Nellore | మరణంలోనూ.. వీడని బంధం.. !
- ఒకే చీరతో ఉరి వేసుకున్న భార్యాభర్తలు
- నెల్లూరు జిల్లాలో విషాదం…
- ఆరు నెలల గర్భవతి సహా భర్త బలవన్మరణం
- వరకవిపూడి దళితవాడలో విషాద ఘటన
తోటపల్లి గూడూరు, ఆంధ్రప్రభ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి దళితవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే చీరతో భార్యాభర్తలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరకవిపూడి దళితవాడకు చెందిన ఈదూరు నరేష్ (34), ఈదూరు ప్రమీలమ్మ (28) గురువారం రాత్రి ఇంట్లోనే ఒకే చీరతో ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరి ఉరి వేసుకున్నారు. మృతురాలు ప్రమీలమ్మ ఆరు నెలల గర్భవతి కావడం మరింత బాధాకరం.
కుటుంబ కలహాలే కారణమా?
కుటుంబ కలహాల కారణంగానే వారు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ జంట ఆత్మహత్యతో వరకవిపూడి దళితవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటనపై తోటపల్లి గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

