నెల్లూరు : ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులతో పాటు మరొక వ్యక్తి దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అతివేగంగా వచ్చిన కారు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వైద్య విద్యార్థులు అభిషేక్, నరేష్‌తో పాటు మరొ ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందగా, ఇంట్లో ఉన్న వెంకట రమణయ్య అనే వ్యక్తి చనిపోయారు. నారాయణ వైద్య కళాశాలలో రెండో ఏడాది చదువుతున్న వైద్య విద్యార్థులు కారులో బుచ్చిరెడ్డిపాలెంలో నిశ్చితార్థం కార్యక్రమానికి వెళ్లి అత్యంత వేగంగా వచ్చి అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nellore | ఇంటిలోకి దూసుకెళ్లిన కారు.. అయిదుగురు మెడికోస్ తో సహా ఆరుగురు దుర్మరణం
