Bihar | 161 సీట్లల్లో ఎన్డీయే లీడ్

Bihar | బీజేపీ..జేడీయూ ఖుషీఖుషీ
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)

బీహార్ అధికారం దిశగా ఎన్డీయే కూటమి దూసుకు పోతోంది. కూటమి బలంతో అధికార పీఠాన్ని కైవశం చేసుకుంటుందా? ఇప్పటికే మేజిక్ ఫిగర్ దాటేసింది. మొత్తం 243 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 150 సీట్లలో ముందంజలో ఉంది. ఈ కూటమిలో బీజేపీ101 సీట్లు, జేడియూ 101 స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 82 సీట్లలో ముందంజ ఉంది. జేడీయూ 66 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇదే ఎన్డీయే కూటమిలోని ఎల్జేపీ 8 సీట్లలో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. మొత్తంగా ఎన్డీయే కూటమి 161 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 76 స్థానాల్లో మహా ఘట్బంధన్ ఆధిక్యంలో ఉంది. మూడు స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించిన జేఎస్పీ రెండు స్థానాలకు పడిపోయింది.
