న‌వీన్ యాద‌వ్ ను గెలిపించాలి… క‌డియం కావ్య‌

న‌వీన్ యాద‌వ్ ను గెలిపించాలి… క‌డియం కావ్య‌

జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా బోరబండ, ఎస్‌ఆర్‌టి నగర్ ప్రాంతాల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం (Dr. Kadiyam Kavya) కావ్య డోర్ టు డోర్ ప్రచారం నిర్వ‌హించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య డోర్ టు డోర్ ప్రచారం చేశారు.

ప్రజా పాలన ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వివరించిన ఎంపి డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… ప్రజా పాలన ప్రభుత్వంతో సంక్షేమం గడపగడపకు చేరిందన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవాలి అన్నారు.

నవీన్ యాదవ్ (Naveen Yadav) విద్యావంతుడు, స్థానికుడు, నిత్యం ప్రజల్లో ఉంటాడు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్న యువ నాయకుడు అని అతడిని గెలిపించడం జూబ్లీహిల్స్ భవిష్యత్ పురోగతికి అవసరం అని వరంగల్ ఎంపీ పిలుపునిచ్చారు. మహిళలతో, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడిన ఎంపి డాక్టర్ కావ్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply