Narsimhulapet ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా కాంగ్రెస్ నాయకులు
Narsimhulapet ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా కాంగ్రెస్ నాయకులు
- జయపురంలో మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం
(Narsimhulapet )నర్సింహులపేట, ఆంధ్రప్రభ:
ఆపదలో ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని గ్రామ శాఖ అధ్యక్షుడు సుక్క వెంకన్న అన్నారు.
మండలంలోని జయపురం గ్రామానికి చెందిన మందుల నర్సయ్య, మందుల ముత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, మంగళవారం కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి తమ సంఘీభావాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా సుక్క వెంకన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై వారికి అండగా నిలవడం పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెలకుర్తి అశోక్ రెడ్డి, నెలకుర్తి వెంకట్ రెడ్డి, బాండ్ల ఐలయ్య, బొల్లం వాసు, భద్రయ్య, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
