జనసేన పార్టీలో చేరిన నరేంద్ర వర్మ
పాలకోడేరు, ఆంధ్రప్రభ: గొల్లలకోడేరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేత చేకూరి రాజా నరేంద్ర వర్మ ( నరేంద్ర రాజు ) శుక్రవారం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు ( చినబాబు ), జనసేన ఉండి నియోజకవర్గ ఇన్చార్జి జుత్తిగ నాగరాజు, జనసేన నేత పివిఎల్ నరసింహారాజు లు నరేంద్ర రాజు కు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. నరేంద్ర రాజు ఆధ్వర్యంలో గొల్లలకోడేరు గ్రామానికి చెందిన మరో వంద మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా చిన్నబాబు, నాగరాజు, పీవీఎల్ మాట్లాడుతూ.. జనసేన పార్టీలో చేరడం అభినందనీయమని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. అందర్నీ కలుపుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. అనంతరం నరేంద్ర రాజు మాట్లాడుతూ గొల్లలకోడేరు గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జనసేనలో చేరానని చెప్పారు. వైసీపీ మండల ఉపాధ్యక్షులు పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. భవిష్యత్తులో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జనసేన అధినాయకులు ఇచ్చిన పిలుపును అందిపిచ్చుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జనసేన పార్టీ లో చేరిన వారిలో అవుడు శ్రీనివాస్ , అడబాల సత్యనారాయణ, జి పెద్దిరాజు , కుక్కల బాబురావు , వీరవల్లి శ్రీను గోపాలరావు, నేతల శేఖర్ , పి దివ్య , కుక్కల మాధవి, పాల లక్ష్మి తోపాటు మరో వందమంది ఉన్నారు.
