Narayanpeta | సమస్యల పరిష్కారంలో పీఆర్‌టీయూ ముందంజ

Narayanpeta | సమస్యల పరిష్కారంలో పీఆర్‌టీయూ ముందంజ

Narayanpeta | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎం.గోవిందరాజులు చేతుల మీదుగా పీఆర్‌టీయూ టీఎస్ 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో పీఆర్‌టీయూ సంఘం నిరంతరం ముందుండి పోరాటం చేస్తోందని ప్రశంసించారు. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సంఘం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లాలో జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనల్లో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని విజయవంతం చేయడంపై ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు వై.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ….. వేసవి సెలవుల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవుల మంజూరు, పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సీసీఎల్ ఉత్తర్వులు త్వరితగతిన జారీ చేయాలని డీఈఓను కోరారు. స్పందించిన డీఈఓ, సైన్స్ ఫెయిర్ ముగిసిన వెంటనే సంబంధిత ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని డీఈఓ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలాజీ, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారి నాగార్జున రెడ్డి, జీసీడీఓ సంగీత, మండల అధ్యక్షులు–ప్రధాన కార్యదర్శులు ఎం. రఘువీర్, ఎం. జనార్దన్, సత్యనారాయణ రెడ్డి, రమేష్, నరసింహారెడ్డి తదితరులు, రాష్ట్ర జిల్లా నాయకులు కే. శ్రీనివాస్, నరేష్, పి. అనిల్ కుమార్, సత్యపాల్, మహేష్ కుమార్, కళ్యాణి, నరసింహారావు, రాములు, సాయప్ప, భాగ్యరాజ్, శ్రీనివాస్, బాలాజీ, అరవింద్ కుమార్, వెంకట్రాములు, సలాం, సాదిక్, వెంకటేశ్వర్లు, శంకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply