Nandyala | అక్రమంగా ఆవుల రవాణా..

  • అడ్డుకున్న హిందూ సంఘాలు..

నంద్యాల, (ఆంధ్రప్రభ బ్యూరో) : ఒడిశా రాష్ట్రం నుండి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కురుకుంద గ్రామానికి చెందిన వ్యక్తులు అక్రమంగా ఆవులను కంటైనర్ వాహనంలో తరలిస్తుండగా, విశ్వహిందూ పరిషత్ (VHP) మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు సంగమేశ్వర సర్కిల్ వద్ద అడ్డగించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఆత్మకూరు అర్బన్ సీఐ రాము, ఎస్సై నారాయణరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కంటైనర్‌ను పరిశీలించగా, అందులో బహుళ సంఖ్యలో ఆవులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వెటర్నరీ వైద్య సిబ్బంది సమక్షంలో ఆవులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

వాహన డ్రైవర్‌తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆవులను ఎర్రగూడూరు సమీపంలోని గోశాలకు తరలించారు

ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీయాలని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చింతలపల్లె వాసు తదితరులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply