అమరావతి రాజముద్ర..

అమరావతి రాజముద్ర..

భారత రాష్ట్రపతికి ప్రత్యేక కృతజ్ఞతలు…

రాష్ట్ర ఎంపీలు.. నంద్యాల ఎంపీ..

నంద్యాల, ఆంధ్రప్రభ : గత 12 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేని రాష్ట్రంగా ఉండేది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తింపు తేవడం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు రాష్ట్రంలోని ఎంపీలందరూ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరితో సహా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు తో న్యూ ఢిల్లీలోరాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఉమ్మడి రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని రాష్ట్రపతికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వివరించారు. దేవతలు పాలించిన రాజధాని పేరు ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉండటం అమరావతి భవిష్యత్తులో మరింత ప్రపంచ స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంట కూటమి ఎంపీలు ఉన్నారు.

Leave a Reply