సీఎస్ఐ పాలెంలో వార్డు విజిట్ చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య
అన్ని విధాలా అండగా ఉంటా.. కూటమి అభ్యర్థులను గెలిపించాలి
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సీఎస్ఐ పాలెంలో నిర్వహించిన వార్డు విజిట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఇతర మౌలిక వసతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎస్ఐ పాలెంతో పాటు నందికొట్కూరు పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందన్నారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు కొత్త పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాడైన సీసీ రోడ్లను పునర్నిర్మిస్తామని, వర్షపు నీరు నిలిచిపోకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చీకటి ప్రాంతాల్లో కొత్త ఎల్ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఎస్ఐ పాలెం వాసులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గిత్త జయసూర్య భరోసా ఇచ్చారు. ఎవరికైనా సమస్య ఉంటే నేరుగా తనను కలవవచ్చన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఆయన.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు జయన్న, సౌజన్య, ధర్మేంద్ర, అయ్యరాజు, బొల్లవరం శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, మున్సిపల్ ఏఈ దినేష్‌కుమార్, పట్టణ టీడీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, జాకీర్ హుస్సేన్, న్యాయవాది జమిల్ భాష, టీడీపీ నాయకురాలు మీనాక్షిదేవి, వేణు, మద్దిలేటి, బ్రహ్మయ్యచారి, కాటపోగు సురేష్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
