ఎస్ఐఆర్ పేరుతో అక్రమాలు..
సీఈసీ జ్ఞానేశ్వర్ తీరు దుర్మార్గం
నాంపల్లి, ఆంధ్రప్రభ : రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టు అప్రజాస్వామికమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డా. బీఆర్ అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అక్రమాలకు పాల్పడుతూ, ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడదని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూల వెంకటయ్య ముదిరాజ్, వీరమల్ల సందీప్ గౌడ్, మేకల రమేష్ ముదిరాజ్, సుదనబోయిన శ్రీను యాదవ్, జంపాల సైదులు, కలకొండ దుర్గయ్య, అంగిరేకుల పాండు, ఈద శేఖర్, బేగరీ గిరి, వడ్లకొండ రమేష్ యాదవ్, జక్కుల మల్లేష్ యాదవ్, గిరి వెంకటయ్య గౌడ్, భాస్కర్ నాయక్, పంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
