వాసవి శివాలయం క్లబ్ అధ్యక్షుడిగా నాళ్ల భానుచందర్
ఖమ్మం కల్చరల్, ఆంధ్రప్రభ: వాసవి క్లబ్ శివాలయం ప్రాంత నూతన అధ్యక్షుడిగా ఖమ్మం నగరానికి చెందిన హైకోర్టు న్యాయవాది నాళ్ల భానుచందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2027 సంవత్సరానికి సంబంధించి ఇటీవల క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నాళ్ల భానుచందర్ ఖమ్మం న్యాయస్థానంలో పలు వివాదాస్పద కేసుల పరిష్కారంలో కీలకపాత్ర పోషించడంతోపాటు హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఖమ్మంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొంటూ అందరినీ సమన్వయం చేస్తున్నారు.
నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా విఎన్ నాళ్ల భానుచందర్, కార్యదర్శిగా విఎన్ సుగ్గల శ్రీహరి, కోశాధికారిగా విఎన్ కురువెళ్ల గోపాలకృష్ణమూర్తి ఎన్నికయ్యారు. వీరితోపాటు క్లబ్ అభివృద్ధి, సేవా కార్యక్రమాల నిర్వహణకు సహకరించే ఇతర కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు.
సమాజంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి శివాలయం క్లబ్‌ను మరింత అభివృద్ధి చేయడంతోపాటు సేవా కార్యక్రమాలను విస్తరించడమే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయనుంది. జిల్లాలో రెండో క్లబ్‌గా 1010 ఫార్మాట్‌ను పూర్తి చేయడం విశేషంగా నిలిచింది.
