ఆ ఇద్దరికి శిక్ష పడింది..!
ఉమ్మడి నల్లగొండ బ్యూరో , ఆంధ్రప్రభ : నల్లగొండ(Nalgonda) జిల్లాలో వేర్వేరు మండలాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి(Sexual assault on girls) పాల్పడిన ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు(POCSO COURT) గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. దేవరకొండ(Devarakonda) మండలం గొట్టిముక్కల(Goṭṭimukkala)
గ్రామంలో 2018 మార్చి 9 న భాస్కరాచారి(Bhaskaracharya) అనే నిందితుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష(20 years in prison), రూ. 25 వేల జరిమానా, బాధితురాలికి రూ. పది లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
మరో కేసులో చండూరు మండలం ధోని పాముల గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితునికి 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.35 వేల జరిమానా, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. మరో రెండు సెక్షన్లు కింద మరో రెండు సంవత్సరాల శిక్ష విధిస్తూ పోక్సో తీర్పు వెలువరించింది.

