చేనేత రుణమాఫీ నిధులను విడుదల చేయాలి…

చేనేత రుణమాఫీ నిధులను విడుదల చేయాలి…

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని చేనేత కార్మికులకు చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఇడం కైలాసం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఈరోజు చేనేత కార్మికులతో కలిసి మాట్లాడుతూ ఎన్నికలలో చేనేతల 2 లక్షల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల తరువాత దానికి లక్షకు కుదించి చేనేతల పట్ల చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. రుణ మాఫీ కూడా పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసి గ్రామీణ ప్రాంత చేనేత కార్మికులకు ఇవ్వలేదని పల్లెలే పట్టుకొమ్మలని మహాత్ముడు చెపితే గాంధీ విగ్రహం పెడతానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పల్లెలను విస్మరించడం అన్యాయమని అన్నారు.

వెంటనే రుణ మాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చేనేత భరోసా, త్రిఫ్ట్ ఫండ్ నిధులు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఒకవేళ వెంటనే నిధులు విడుదల చేయకపోతే త్వరలో ఉద్యమ బాట పడతామని అందులో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గంజి పెద్దలు, బడుగు తిమ్మయ్య, నామని గణేష్, రవ్వ రాములు, సూరేపల్లి బుచ్చయ్య, పులిపాటి వెంకటేశం, పెదగాని రాములు, చెరిపల్లి రమేష్, గుర్రం రాఘవేంద్ర పాల్గొన్నారు.

Leave a Reply