Nagarkurnool ముగిసిన ఎస్ఎల్బీసీ ఏరియల్ సర్వే
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్(Nagarkurnool) జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మన్నె వారి పల్లి గ్రామ సమీపన ఎస్ఎల్బిసి తన్నిల్ వద్ద గత మూడు రోజులుగా నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్(National Geophysical Research Institution) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ సర్వే ఈ రోజు ముగించినట్లు తెలుస్తోంది.
సర్వే నివేదికలు గురువారంలోగా సంబంధిత అధికారులకు అందజేసే అవకాశం ఉందని ఎస్ ఎల్ బీసీ జయ ప్రకాష్(SLBC Jayaprakash) కంపెనీ డిఈఎస్ తాతారావు ఈ రోజు సమాచారం ఇచ్చారు. ఈనెల 10న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి(State Chief Minister Enumula Revantha Reddy), భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో హాజరై సర్వేను ప్రారంభించారు.

