Nagarjuna | మరో సినిమాకి ఓకే చెప్పారా..?

Nagarjuna | మరో సినిమాకి ఓకే చెప్పారా..?

Nagarjuna | కళ్యాణ్ కృష్ణ సక్సెస్ ట్రాక్ రికార్డ్
నాగార్జున కోసం కొత్త కథ రెడీ చేస్తున్న దర్శకుడు
100వ సినిమా తర్వాతే సోగ్గాడే కాంబో?
త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి సోగ్గాడే చిన్ని నాయనా. ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా 80 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. అంతే కాకుండా.. 50 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన తొలి సీనియర్ హీరోగా నాగార్జునకు రికార్డ్ అందించిన సినిమా ఇది. అయితే.. ఇప్పుడు కాంబో గురించి వార్తలు వస్తున్నాయి. మరి.. నిజంగానే సోగ్గాడే కాంబో సెట్ అయ్యిందా..?

Nagarjuna

సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించి అటు ఆడియన్స్, ఇటు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. అయితే.. మాస్ మహారాజా రవితేజతో నేల టిక్కెట్ అనే సినిమా తీసాడు. అది ప్లాప్ అవ్వడంతో కళ్యాణ్ కృష్ణకు గ్యాప్ వచ్చింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలిన కథ రెడీ చేయడం జరిగింది. అయితే.. అది రీమేక్ మూవీ. ప్రస్తుతం రీమేక్ సినిమాలను ఆదరించడం లేదు. ఈ విషయం భోళా శంకర్ మూవీతో చిరుకు తెలిసింది. అందుకనే ఈ ప్రాజెక్ట్ ను ఆపేసారు. అప్పటి నుంచి కళ్యాణ్‌ కృష్ణ సినిమా ఎవరితో అనేది సమాధానం లేని ప్రశ్నలా మారింది.

Nagarjuna

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. కళ్యాణ్‌ కృష్ణ నాగార్జున కోసం ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడట. ఇటీవల స్టోరీ లైన్ చెబితే బాగుంది.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారట. దీంతో ఇప్పుడు కళ్యాణ్‌ కృష్ణ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం నాగార్జున 100వ సినిమా బిజీలో ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కళ్యాణ్ కృష్ణతో సినిమా చేసే ఛాన్స్ ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాల తర్వాత చేసే ఈ సినిమాతో నాగ్ కు హ్యాట్రిక్ సక్సెస్ ఇవ్వాలని ఎంతో పట్టుదలతో కథ పై బాగా కసరత్తు చేస్తున్నాడట కళ్యాణ్ కృష్ణ. త్వరలోనే ఈ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్. మరి.. ఈసారి నాగ్ ను కొత్తగా ఎలా చూపిస్తాడో చూడాలి.

Nagarjuna

CLICK HERE TO READ karthi | తెలుగులో చేస్తున్న సినిమాలు ఇవే..

CLICK HERE TO READ MORE

Leave a Reply