వైద్య ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి సంఘీభావం

రెగ్యులరైజేషన్‌తో పాటు న్యాయమైన హక్కులు కల్పించాలని డిమాండ్‌..
సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ

నాగర్‌కర్నూల్‌, ఆంధ్రప్రభ: ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌తో పాటు న్యాయమైన హక్కుల సాధన కోసం నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు ఎమ్మెల్యే డాక్టర్‌ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. గురువారం సాయంత్రం సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉద్యోగుల హక్కుల సాధనకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.