ఏడు నామినేషన్లు తిరస్కరణ
108 నామినేషన్లకు ఆమోదం
ముత్తుకూరు, ఆంధ్రప్రభ : మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల్లో భాగంగా దాఖలైన నామినేషన్ల పరిశీలనలో ఏడు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ. రమేష్‌బాబు తెలిపారు. శనివారం ముత్తుకూరు ఎంపీటీసీ ఎన్నికల కార్యాలయంలో మొత్తం 115 నామినేషన్లను పరిశీలించగా, 108 నామినేషన్లకు ఆమోదం లభించినట్లు వెల్లడించారు.
