ముత్తుకూరు బిట్-1 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా దేవా రెడ్డి నామినేషన్

ఈఆర్‌వో రమేష్ బాబుకు నామినేషన్ పత్రాలు అందజేత

ముత్తుకూరు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముత్తుకూరు బిట్-1 ఎంపీటీసీ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్థానిక నాయకుడు దేవా రెడ్డి అశోక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీటీసీ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్‌వో) ఓ. రమేష్ బాబుకు తన నామినేషన్ పత్రాలను అందజేసినట్లు అభ్యర్థి దేవా రెడ్డి శుక్రవారం వెల్లడించారు.

రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డిలతో పాటు పార్టీ కార్యకర్తలు, గ్రామస్తుల సహకారంతో తాను ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రస్తుత పరిస్థితులను తెలియజేస్తూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.