మురసు.. ముసురు!
జనజీవనం దిగ్బంధనం!
బందరు, ఆంధ్రప్రభ: భీకర గాలులు.. భారీ వర్షాలతో అప్పట్లో ఆర్నబ్ తుపాను మధ్య ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైతే.. ఇప్పుడు మురసు తుపాను ప్రభావంతో రాష్ట్రం అల్లాడిపోతోంది. మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లా కకావికలమవుతోంది. ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. బందరు పట్టణం జలవిలయంగా మారింది. పొలాలన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి.
వేరుశెనగ, అపరాల పంటలు (శనగ, పెసర) నీటిలో కనిపించకుండా పోయాయి. వరి పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వీధుల్లోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉండటం.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలన్నీ అంధకారంలో మగ్గుతున్నాయి.

